హుజూరాబాద్ బరిలో 'థౌజండ్ వాలా'?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (08:13 IST)
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో థౌజండ్ వాలా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును అక్కడ వెయ్యి మందిని పోటీకి నిలుపుతామంటూ పటాకా పేల్చారు ఆర్ కృష్ణయ్య.  ఇప్పటి వరకూ ఎంతో సైలెన్స్ మెయిన్‌టైన్ చేసిన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికమీద స్పందించడం మాత్రమే కాదు.. హుజూరాబాద్‌ను ‘హజరతా బాద్’… అంటే వెయ్యి మందిని ఉపఎన్నిక నిలుపుతామని ప్రకటించారు. దీంతో ఎక్కడి అభ్యర్ధులక్కడే గప్ చుప్ అయిపోయారు. దీంతో ఇదెక్కడి గొడవ? అని తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

గతంలో ఇలాంటి ఎన్నికల కారణంగా అక్కడి ఎన్నికల ఫలితాలు ఎంతటి ప్రభావితం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ తరహా ఎన్నిక వార్త హుజూరాబాద్ లోనూ వెలుగులోకి రావడంతో.. ఇదో చర్చగా మారింది.

కొన్నాళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించింది ప్రభుత్వం. తద్వారా 7600 మంది ఉపాధి కోల్పోయారని.. ఇందుకు తగిన సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఆర్ కృష్ణయ్య.

వీరందరినీ విధుల్లోకి తీసుకోకుంటే తాము వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను.. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దింపుతామని హెచ్చరించారు. వీరితో పాటు ఇటీవల తొలగించిన స్టాఫ్ నర్సులు సైతం నామినేషన్లు వేసే అవకాశముందని హెచ్చరించారు కృష్ణయ్య.

ఒక వేళ అదే జరిగితే.. న్యూస్ పేపర్ సైజు బ్యాలెట్ పేపర్లు, నీళ్ల డ్రమ్ముల సైజు బ్యాలెట్ బాక్సులు, గుర్తును పోలిన గుర్తులు, పేర్లను పోలిన పేర్లతో నానా తంటాలు పడాల్సి వస్తుంది. కాబట్టి.. ఇలాంటి పరిస్థితి రావద్దనే ఆశిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్ధులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments