Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది... ఎక్కడ?

హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉంటూ వచ్చిన ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది. ఆ భవనం పేరు 'ది రాయల్ హోటల్'. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నాంపల్లిలో ఉన్న రాయల్ హోటల్‌ను స్వాతంత్ర్యానికి పూర్వమే అంటే 90 ఏళ్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (12:07 IST)
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉంటూ వచ్చిన ముత్తాతల కాలంనాటి భవనం నేలకూలింది. ఆ భవనం పేరు 'ది రాయల్ హోటల్'. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నాంపల్లిలో ఉన్న రాయల్ హోటల్‌ను స్వాతంత్ర్యానికి పూర్వమే అంటే 90 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ చారిత్రక సౌధం మెట్రో పనుల్లో భాగంగా కూల్చివేశారు. 
 
సంపూర్ణ భారతావనిలో భాగంగా ఆనాడు పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన సింధీ కులస్తుడు శంకర్ దాస్ ఆరు గదులతో ప్రారంభించిన ఈ హోటల్‌ను 60 గదులకు విస్తరించారు. అప్పట్లో రోజుకు గది అద్దె అర్థ రూపాయ ఉండేది. ప్రస్తుతం 600 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. ఆనాడు ప్రముఖులు, సంపన్నులు ఈ హోటల్‌లో బస చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ది రాయల్ హోటల్ ఉండటంతో సందర్శకులతో నిత్యం కళకళలాడుతూ కనిపించేది. 
 
ఈ హోటల్ యజమాని ప్రకాష్ ఏ బొలాకి స్పందిస్తూ.. ‘ది రాయల్’ హోటల్‌ను నాలుగు తరాల నుంచి నడిపిస్తున్నామన్నారు. ముత్తాతల నుంచి ఈ హోటల్ తమకు వారసత్వంగా లభించిందన్నారు. కానీ, ఈ హోటల్ భవనాలను కూల్చివేసే పరిస్థితులు వస్తాయని, 60 గదుల తమ హోటల్‌ను కూల్చివేస్తారని తాము ఎన్నడూ ఊహించలేదన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments