పెళ్లి విందులో కోడికూర వడ్డించలేదని గొడవ... ఆగిన పెళ్లి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (08:50 IST)
పెళ్లి విందులో చికెన్ కర్రీ వడ్డించలేని వరుడి స్నేహితులు గొడవపెట్టుకున్నారు. దీంతో శుభమా అంటూ జరగాల్సిన ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జగద్గరిగుట్టి రింగ్ బస్తీకి చెందిన యువకుడి, కుత్బుల్లాపూర్‍‌కు చెందిన యువతికి ఇటీవల వివాహం నిశ్చమైంది. షాపూర్ నగరులోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం ఉదయం వివాహం జరగాల్సివుంది. 
 
అయితే, ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు భోజనం ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడి కుటుంబం కావడంతో వారు పూర్తిగా శాఖాహార భోజనాన్ని మాత్రమే వడ్డించారు. 
 
ఇక విందు ముగుస్తుందన్న సమయంలో వరుడు తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాఖాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి, వధువు తరపు వారితో గొడవకు దిగి, అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వివాదం కాస్త పెద్దదై ఇరు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. 
 
దీంతో సోమవారం జరగాల్సిన వివాహం కాస్త రద్దు అయింది. ఈ వ్యవహారం కాస్త పోలీసుల వద్దకు వెళ్లింది. వారు ఇరు కుటుంబాల సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆగిపోయిన పెళ్లి బుధవారం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments