Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి హత్య... నిందితుల కోసం పోలీసులు గాలింపు(Video)

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (17:05 IST)
సెలవుల్లో పదవ తరగతి కోసం స్పెషల్ క్లాస్ అని వెళ్లిన శ్రావణి హత్యకు గురైంది. ఆమెను ఎందుకు చంపారన్నది తెలియాల్సి వుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలోని హజీపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రతిరోజులానే కీసరలో సెరినీటి ప్రవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి పూర్తిచేసిన శ్రావణి గురువారం ఉదయం స్కూలుకి వెళ్లి వచ్చి సాయంత్రం బస్సు దిగి ఇంటికి వస్తున్న సమయంలో కనపడకుండా పోయింది. శ్రావణి రాత్రి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కుటుంబ సభ్యులు శ్రావణి ఆచూకి కోసం పోలీసులకు పిర్యాదు చేశారు.
 
భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహ కూతురు పాముల శ్రావణి (14) మేడ్చల్ జిల్లా కీసరలో సెరినిటీ స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసింది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి కావడంతో స్కూల్ స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు. రోజులాగే గురువారం ఉదయం స్కూలుకి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోవడంతో అమ్మాయి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
గురువారం రాత్రి నుండి ఆచూకి కోసం గాలిస్తున్న సందర్భంలో శుక్రవారం ఉదయo హాజిపూర్ శివార్లలో ఉన్న (మర్రి భావి) అనే ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పాడుబడ్డ భావిలో శ్రావణి స్కూల్ బ్యాగుతో పాటు ఆ ప్రక్కనే వున్న మరో మట్టిబావిలో ఆమెను పూడ్చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దాంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఐతే తాము సమాచారాన్ని అందించినా పోలీసులు ఆలస్యంగా స్పందించారంటూ శుక్రవారం అర్థరాత్రి స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పారు. దోషుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments