Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోనులో వేద మంత్రాలే సాక్షిగా రహస్య పెళ్లి... విద్యార్థినిని గర్భవతి చేసిన ఆర్ఎంపీ వైద్యుడు

Advertiesment
ఫోనులో వేద మంత్రాలే సాక్షిగా రహస్య పెళ్లి... విద్యార్థినిని గర్భవతి చేసిన ఆర్ఎంపీ వైద్యుడు
, సోమవారం, 4 మార్చి 2019 (15:57 IST)
స్నేహం పేరుతో ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఫోనులోనే వేద మంత్రాలు వినిపించాడు. మెడలో మూడు ముళ్లు వేయించాడు. రహస్య కాపురం పెట్టి... చివరకు ఆ విద్యార్థిని గర్భవతి చేశాడు. తాను ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో అబార్షన్ కూడా చేశాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో నిలదీశారు. దీంతో ఆర్ఎంపీ వైద్యుడి గుట్టు బహిర్గతమైంది. 
 
ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామ యువకుడైన బొయిన చైతన్య అనే వ్యక్తి స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా ఊరూరా తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నాడు. 
 
ఆర్.ఎం.పి వైద్యుడు కావడంతో వృత్తిరీత్యా అందరితోనూ చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సంధ్య అనే డిగ్రీ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెతో స్నేహం పేరుతో చనువు పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలో గత యేడాది క్రితం ఖమ్మం జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. 
 
తన ఫోన్‌‌లో వేద మంత్రాల ఆడియో ఆన్‌ చేసి తాళి కట్టాడు. ఆ తర్వాత రహస్యంగా కాపురం పెట్టాడు. చివరకు ఆమె గర్భవతి అయింది. అయితే, తాను ఆర్.ఎం.పి వైద్యుడు కావడంతో అబార్షన్‌ చేశాడు. ఈ పరిస్థితుల్లో గత నెల 21వ తేదీన బైక్‌పై జగ్గయ్యపేట వెళుతున్న వీరిద్దరిని ఆమె బంధువులు చూశారు. ఆమె ఇంటోళ్లకు తెలిసింది. వారు నిలదీయగా అసలు విషయం వెల్లడైంది. దీంతో సంధ్యను వదిలివేసి పారిపోయాడు. ఇపుడు బాధితురాలు న్యాయం కోసం చైతన్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడిన శ్రీజ్యోతి మిస్టరీ : 20 యేళ్లు చిన్నదైనా ఆశపడ్డాడు.. కాదన్నందుకు కడతేర్చాడు...