Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించట్లేదు.. అందుకే చనిపోతున్నా...

Telangana
Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (10:02 IST)
ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ యువతి తన ప్రేమను అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనై ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని షేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ చింతల్‌ గణేష్‌ నగర్‌కు చెందిన పి.మణికంఠ (25) తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ నెల 17న మణికంఠ తన స్నేహితుడికి ఫోన్‌ చేసి 'నేను ఓ అమ్మాయిని ప్రేమించాను.. కానీ, ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించడంలేదు, అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నా.. అందరూ జాగ్రత్త' అని ఫోన్‌ పెట్టేశాడు.
 
స్నేహితుడు తిరిగి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో వెంటనే మణికంఠ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మణికంఠ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతుండగా గురువారం జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుందని పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. 
 
చెరువు వద్ద ఉన్న మృతుడి బైక్‌, వస్తువుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయంతో చెరువులోంచి మృతదేహాన్ని బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments