Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైన్ చెల్లించమని కోరిందనీ... టీటీఐని రైల్లోనుంచి తోసేశారు...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (11:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జంక్షన్‌లో ఓ దారుణం జరిగింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని అపరాధం చెల్లించమని అడిగినందుకు ఆ మహిళా టీటీఐని రైల్లో నుంచి కిందికి దించేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా నీలిమ అనే మహిళ పని చేస్తోంది. ఈమె సికింద్రాబాద్‌ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌ క్లాస్ ఒకటో నంబరు బోగీలో వెళ్లి ప్రయాణికుల వద్ద టిక్కెట్లను తనిఖీ చేపట్టారు. అపుడు కొందరు ప్రయాణికులు జనరల్‌ టికెట్‌ తీసుకుని స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లోకి రావడంతో గుర్తించి, వారందరినీ అపరాధం చెల్లించాలని కోరింది. 
 
అయితే, బోగీ ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో ఏ ఒక్క ప్రయాణికుడు ఆమె మాటను పట్టించుకోలేదు. పైగా, ఆమెను కిందికి తోసేశారు. దీంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్‌ బోగీ ప్రయాణికులు గమనించి బయటికిలాగేశారు. 
 
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments