Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై వ్యామోహం... భర్తను వాహనంతో ఢీకొట్టించి చంపేసిన భార్య...

Webdunia
గురువారం, 16 జులై 2020 (14:16 IST)
ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా నూరేళ్లపాటు జీవించాల్సిన భార్యాభర్తల సంబంధాలు మరింతగా దిగజారిపోతున్నాయి. పరాయి పురుషులు లేదా స్త్రీల మోజులో పడిన భార్యలు లేదా భర్తలు కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. తాజాగా ఓ వార్డు మెంబరుగా ఉన్న ఓ మహిళ... ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను డీసీఎం వాహనంతో ఢీకొట్టించి చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మెడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్‌కు సమీపంలోని సైదొని గడ్డ తండాకు చెందిన సురేష్, బబిత అనే దంపతులు ఉన్నారు. అయితే, బబిత సైదోనిగడ్డ గ్రామ ‌7వ వార్డు మెంబరుగా ఉన్నారు. ఆమెకు దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్‌సింగ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి, భార్యను మందలించాడు. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పి, భర్త అడ్డు తొలగించాలని కోరింది.
 
దీంతో బబిత, ఆమె ప్రియుడు ప్రేమ్‌సింగ్ కలిసి సురేష్‌ను చంపాలని ప్లాన్ వేశారు. తమ కుట్రలో భాగంగా, ప్రేమ్‌సింగ్ తన స్నేహితులతో కలిసి ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో భారత్ బయోటక్‌లో పనిచేసే సురేష్.. విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా యాడారం వద్ద మే 23వ తేదీన డీసీఎం వాహనంతో ఢీకొట్టించారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి ఆస్పత్రికి కారులో తరలిస్తున్నట్లు నటించి దారిలోనే గొంతు పిసికి చంపేశారు. 
 
అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగు చూసింది. దీంతో మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments