సైకిల్ దిగనున్న రేవంత్ రెడ్డి .. తెలంగాణాలో టీడీపీకి దిక్కెవరు?

తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి త్వరలోనే సైకిల్ దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన టీడీపీకి టాటా చెప్పి... కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని పలువురు అంటున్నార

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (09:15 IST)
తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి త్వరలోనే సైకిల్ దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన టీడీపీకి టాటా చెప్పి... కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని పలువురు అంటున్నారు. దీనికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను చెప్పుకుంటున్నారు. రేవంత్ ఢిల్లీ చేరుకోగానే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే అక్కడికి వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రేవంత్ ఖండించినప్పటికీ.. గుసగుసలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. 
 
గతంలో తెరాస మంత్రులు కూలీ పనుల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీకి వచ్చానని రేవంత్ వివరణ ఇచ్చారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రెడ్డి… కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కూడా కలిశారు. దీంతో రేవంత్ చెబుతున్న వాదనకంటే ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే వార్తకే బలం చేకూరింది. ఇప్పటికీ తాను కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు కాలేదని రేవంత్‌ చెబుతున్నప్పటికీ… నవంబర్ 9వ తేదీన గాంధీ భవన్‌ మెట్లెక్కడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments