Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల.. నేడు చంద్రబాబుకు రేవంత్ : ఎల్. రమణ

నాడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే ఇపుడు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆ

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:37 IST)
నాడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే ఇపుడు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరవొచ్చన్న సంకేతాలు వినొస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఎల్. రమణ ఆదివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వేళ, ఆనాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీకి మరో నాదెండ్లలా తయారయ్యారన్నారు. 
 
ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న వేళ, ఢిల్లీకి వెళ్లి, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి, నమ్మి పదవులిచ్చిన అధినేతకు ఆయన వెన్నుపోటు పొడిచి అభినవ నాదెండ్లగా మారారని దుయ్యబట్టారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఆయన చూస్తున్నారని, అది జరిగే పది కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments