మూడు రోజులు బయటకు రావొద్దు : ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (08:42 IST)
తెలంగాణ రాష్ట్రంతో పాటు.. ఏపీలోని కొన్ని జిల్లాలకు చెందిన ప్రజలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. ఈ మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఈనెల 5 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాడ్పులు వీస్తాయని, దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వివరించింది. ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంక ర్‌ భూపాలపల్లి, ములుగు. భ ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని పేర్కొంది. 
 
కాబట్టి ప్రజలు ఆరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా శనివారం భద్రాచలంలో గరిష్ఠంగా 42.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఏపీలోను కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments