Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకల్లేవ్!

Webdunia
గురువారం, 14 జులై 2022 (10:00 IST)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. 
 
గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
 
వర్షాల వల్ల వాటిల్లిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్ నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా కారణాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, కొన్ని పశువులు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు. 
 
9 చెరువులకు గండ్లు పడగా, వాటిలో పడకల్ పెద్ద చెరువు వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. 42 ప్రాంతాల్లో రోడ్లపై నుండి వర్షపు జలాలు ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ దారి మళ్ళించామని మంత్రికి వివరించారు. 
 
నాలుగు చోట్ల రోడ్లు తెగిపోవడంతో సంబంధిత గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు.  
 
అయితే ఇంకను రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments