Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో కుండపోత - డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు

Advertiesment
kadem project
, బుధవారం, 13 జులై 2022 (13:40 IST)
తెలంగాణా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. చెరువులు పూర్తిగా నిండిపోగా, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలు నీట మునిగాయి.
 
ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని జలాశయాల్లో ఒకటైన కడెం ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. సామర్థ్యానికి మంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కలు నీరు వరద రూపంలో వచ్చి చేరింది. 
 
దీంతో 25 గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో వణికిపోతున్నారు. గత 1995 తర్వాత ఈ రిజర్వాయర్‌కు ఈ స్థాయిలో వరద నీరు పోటెత్తడం, ఈ ప్రాజెక్టు డేంజర్ జోన్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితులు - ఎమర్జెన్సీ విధింపు