Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా వ్యాప్తంగా తెరుచుకున్న బడులు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:36 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తి దెబ్బకు మూతబడిన ఈ పాఠశాలలు కొన్ని నెలల తర్వాత బడుల్లో బడి గంటలు మోగాయి. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ చిన్నారులు స్కూళ్ల‌కు వ‌స్తున్నారు. 
 
హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్ స్కూల్‌కు విద్యార్థులు అధిక సంఖ్య‌లో వ‌చ్చారు. మాస్క్‌లు ధ‌రించిన విద్యార్థులు స్కూళ్ల‌కు హాజ‌ర‌య్యారు. కొన్ని చోట్ల స్కూల్ సిబ్బంది విద్యార్థుల‌ను శానిటైజ్ చేశారు. 16 నెల‌లుగా పాఠ‌శాల‌ల‌కు దూరంగా ఉన్న పిల్ల‌ల‌కు ఇప్పుడు మ‌ళ్లీ బ‌డిబాట ప‌ట్టారు. దీంతో స్కూళ్ల‌లో ఆనంద‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. క్లాసు రూమ్‌లో ఉండే ఆనందాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.
 
అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ‌లో గురుకులాలు, హాస్ట‌ళ్లు మిన‌హా అన్నింటా ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు ప్రారంభం అయ్యాయి. ఇంట‌ర్‌, డిగ్రీ కాలేజీలు కూడా ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల‌ను మొద‌లుపెట్టాయి. ఇంట‌ర్ విద్యార్థులు అవ‌స‌రమైతే యూట్యూబ్ పాఠాలు విన‌వ‌చ్చు అని విద్యాశాఖ పేర్కొంది. 
 
నగరంలోని కొన్ని స్కూళ్లు మ‌రికొన్ని రోజులు ఆన్‌లైన్ క్లాసులు మాత్ర‌మే నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ప్ర‌భుత్వ స్కూళ్లు ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల కోసం తెరుచుకున్నాయి. సిటీలోని రాజ్‌భ‌వ‌న్ స్కూల్‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సంద‌ర్శించారు.
 
మ‌రో వైపు ఆర్టీఏ అధికారులు ఇవాళ న‌గ‌రంలో 12 పాఠ‌శాల‌ల బ‌స్సుల‌ను సీజ్ చేశారు. బ‌స్సుల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించారు. డాక్యుమెంట్లు స‌రిగాలేని వాహ‌నాల‌ను సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments