Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100కు బదులు రూ.500... ఎగబడి డ్రా చేసిన జనాలు

Webdunia
ఆదివారం, 16 మే 2021 (09:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా అమరచింతలో ఓ వింత జరిగింది. ఏటీఎం కేంద్రం నుంచి రూ.100 నోట్ల స్థానంలో రూ.500 నోట్లు వచ్చాయి. ఈ విషయం తెలిసిన జనాలు... ఎగబడి డ్రా చేశారు. ఏటీఎం యంత్రంలో తలెత్తిన పొరపాటు కారణంగా ఇలా జరిగింది. డబ్బు డ్రా చేసినవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి తిరిగి ఇవ్వాలని లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏటీఎం నిర్వహణ అధికారి హెచ్చరించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియావన్‌ ఏటీఎం కేంద్రంలో శనివారం ఓ కస్టమర్‌ రూ.4 వేలు విత్‌డ్రా చేసుకోగా.. వంద నోట్ల స్థానం‌లో ఐదొందల నోట్లు వచ్చాయి. మొత్తం రూ.20 వేలు చేతికి అందాయి. దాంతో అతడు అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులకు చేరవేశాడు. వారి ద్వారా అమరచింత పరిసర గ్రామాలకు వ్యాపించింది. 
 
దాంతో ఆ ఏటీఎం కేంద్రానికి బ్యాంకు ఖాతాదారుల తాకిడి పెరిగింది. డబ్బులు డ్రా చేసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ సిబ్బంది.. విషయాన్ని ఆరా తీశారు. వెంటనే ఏటీఎం కేంద్రానికి తాళం వేయించి, నిర్వాహకులకు సమాచారం అందించారు. ఏటీఎంలో నగదును లోడ్‌ చేసినప్పుడు.. రూ.100 నోట్ల ట్రేలో రూ.500 నోట్లను పొరపాటున పెట్టినట్లు అధికారులు గుర్తించారు. 
 
ఇలా మూడు రోజుల్లో రూ.5.88 లక్షల మేర అతనపు విత్‌డ్రావల్స్‌ జరిగినట్లు లెక్క తేల్చారు. అదనంగా డబ్బులు డ్రా అయిన వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేసి, డబ్బులు రికవరీ చేస్తామని ఏటీఎం ఏజెన్సీ టెక్నికల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments