Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం మరిచిపోయారు.. గర్భిణీపై అత్యాచారయత్నం

ఇటీవలికాలంలో తెలంగాణా రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, నిన్నటికినిన్న తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భావించిన ఓ మహిళ... కన్నబిడ్డను ప్రియుడితో కలిసి వేడి పెనంపై కూర్చోబెట్టి చ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (11:16 IST)
ఇటీవలికాలంలో తెలంగాణా రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, నిన్నటికినిన్న తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భావించిన ఓ మహిళ... కన్నబిడ్డను ప్రియుడితో కలిసి వేడి పెనంపై కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణం హైదరాబాద్ చిలకలగూడలో జరిగింది. తాజాగా ఏడేళ్ల కుమార్తెతో ఉన్న ఏడు నెలల గర్భిణీపై అత్యాచారయత్నం జరిగింది. మానవత్వం మరిచిపోయి ఈ దారుణానికి పాల్పడింది ఓ వ్యాను డ్రైవర్, క్లీనర్ కావడం గమనార్హం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెళ్లి శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే. 
 
రావెళ్లి పంచాయతీలోని పోతరాజ్‌పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం కళావతి ఏడు నెలల గర్భవతి. శనివారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో పాతదుస్తులు విక్రయించిన కళావతి(35) తిరిగి గ్రామానికి పయనమైంది. రాత్రి 10 గంటల సమయంలో తన పెద్ద కుమార్తె శిరీష(7)తో కలిసి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న వ్యాను క్యాబిన్‌లో ఎక్కింది. అందులో ఉన్న డ్రైవరు, మరో వ్యక్తి కళావతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అత్యాచారయత్నం చేయబోయారు. ఈ క్రమంలో రావెళ్లి శివారులో కరీంగూడ వద్ద ఆమె దిగాల్సినచోట వాహనం ఆపకుండా ముందుకు పోనిచ్చారు.
 
దీంతో భయాందోళనకు గురైన కళావతి ఒక్కసారిగా కిందకు దూకింది. అయితే దుండగులు వ్యాన్‌ను మాత్రం ఆపలేదు. అలాగే అరకిలో మీటరు ముందుకెళ్లిన తర్వాత బాలికను, పాతదుస్తుల మూటను రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. బాలిక తిరిగి తల్లి దూకినచోటకు వచ్చి ఆమెను లేపే ప్రయత్నం చేసింది. తల్లి స్పందించకపోవడంతో అక్కడికి కొద్దిదూరంలో ఉన్న దాబా వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని అక్కడున్నవారికి వివరించింది. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని కళావతి మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన మహిళది నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్థులే నగదు పోగేసి అంత్యక్రియలు నిర్వహించడం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం