Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని ఆస్పత్రులకు వెళ్లాలంటే.. ఇవి ఉండాల్సిందే...

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (10:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు చేరాలంటే ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 
ఆంధ్రప్రదేస్, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణాకు వచ్చే కరోనా రోగుల సంఖ్య అధికమైపోయింది. దీంతో తెలంగాణ ఆసుపత్రులకు వచ్చే వారికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
 
పొరుగు రాష్ట్రాల నుంచి అంబులెన్సులు, వాహనాల్లో చికిత్స కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వారి వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండడంతో సీఎస్ సోమేశ్ కుమార్ నిన్న ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు.
 
ఇక నుంచి హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే రోగులు ఇక్కడి ఆసుపత్రులలో ముందుగా బెడ్‌ను రిజర్వ్ చేసుకుని వుంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ఈ వివరాలను కంట్రోల్ రూము (040 2465119, 9494438251)కు కానీ, లేదంటే idsp@telangana.gov.in వెబ్‌సైట్‌కు కానీ ఆయా ఆసుపత్రులు తెలియజేయాల్సి ఉంటుంది. 
 
ఇందుకోసం రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబరు, టైఫ్ ఆఫ్ బెడ్ వంటి వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రోగుల వాహనాలు రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ వివరాలను చెబితే అనుమతిస్తారు. ఇందుకోసం సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments