Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు కేసీఆర్ అవసరం, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యం: ఆకాశానికెత్తేసిన అక్బరుద్దీన్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (21:46 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస-ఎంఐఎం పార్టీల మధ్య స్నేహం చాలా దృఢంగా కొనసాగుతూ వుంది. సందర్భం వచ్చినప్పుడల్లా తెరాసకి ఎంఐఎం, వారికి తెరాస వెన్నుదన్నుగా నిలుస్తూ ఆవిధంగా ముందుకు పోతున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అవసరమనీ, అలాంటి నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

 
బంగారు తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. ఎన్నో రాష్ట్రాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను తమతమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారని కితాబిచ్చారు.

 
ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ... పోలీసు, మెడికల్, విద్యా విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం మంచి నిర్ణయం అంటూ ప్రశంసించారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments