Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిజాబ్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారంటే? అవి ధరిస్తే తప్పేంటి?

Advertiesment
Muslim women
, మంగళవారం, 15 మార్చి 2022 (17:07 IST)
కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హిజాబ్ వ్యవహారంపై కోర్టు ఇచ్చిన తీర్పు... మతం, సంస్కృతి, వ్యక్తీకరణ, కళ వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. 
 
ఇది ముస్లిం మహిళలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదన్నారు అసద్. హిజాబ్‌ ధరిస్తే సమస్య ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. 
 
కర్నాటకలో నెలకొన్న హిజాబ్ వివాదంపై తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇదే విషయమై స్పందించారు. కోర్టు తీర్పు చాలా నిరాశజనకమైనదన్నారు. ఓ వైపు మనం మహిళల హక్కులు , వారి సాధికారతపై పెద్ద  పెద్ద వాదనలు చేస్తున్నామన్నారు. మరోవైపు వారు కోరుకున్నది ధరించే హక్కు కూడా మనం వారికి ఇవ్వడం లేదన్నారు. ఈ హక్కు కోర్టులకు ఉండకూడదన్నారు మెహబూబా ముఫ్తీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఒక్కసారికి క్షమిస్తున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లూ మళ్లీ తప్పు చేయొద్దు : సీఎం కేసీఆర్