Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిజాబ్ ధారణ ముస్లిం మత ఆచారం కాదు.. కర్నాటక హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు

Advertiesment
Hijab
, మంగళవారం, 15 మార్చి 2022 (11:52 IST)
ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాలన్నది మత ఆచారం కాదని కర్నాటక హైకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. అదేసమయంలో భారత రాజ్యాంగం మేరకు విద్యార్థులకు యూనిఫాంలు నిర్ణయించే అధికారం విద్యా సంస్థలకే ఉందని స్పష్టం చేసింది. 
 
ఇటీవల హిజాబ్ వివాదం చెలరేగి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. నెల రోజులగా దేశ వ్యాప్తంగా ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఇపుడు కర్నాటక హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెపపడింది. 
 
హిజాబ్ ధరించడం మంత ఆచారం కాదని కోర్టు తేల్చి చెప్పింది. తరగతి గదుల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. మొత్తం ఐదు వ్యాజ్యాలను కలిపి కోర్టు విచారించింది. 
 
ఈ పిటిషన్లపై ఇప్పటికే 11 రోజుల పాటు సుధీర్ఘంగా వాదనలను జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జె.ఎం.ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు ఫుల్‌బెంచ్ మంగళవారం తుది తీర్పును వెలువరించి, ఆ పిటిషన్లను కొట్టివేసింది. మతపరమైన దుస్తులను వేసుకుని రావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంనే వేసుకునిరావడమే సహేతుకమని స్పష్టం చేసింది. 
 
"ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవ్వరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యా సంస్థలు నిర్ధేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యజమాన్య ప్రాథమిక హక్కు. అందుకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేయొచ్చు" అని విస్పష్టం తీర్పునిచ్చింది. 
 
అదేసమయంలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులన స్కూలులోకి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ ఛైర్మన్‌లను తొలగించాలంటూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు