Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరీశ్‌రావు రియల్ లీడర్ ... ఆస్తి తాకట్టు పెట్టి మరీ ఆటోవాలాలకు రుణాలు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:16 IST)
తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోమారు రియల్ లీడర్ జేజేలు అందుకుంటున్నారు. ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన ఆస్తిని బ్యాం కుకు తాకట్టు పెట్టారు. దీంతో ఇప్పుడు వారికి రుణాలు సులభంగా అందనున్నాయి.

గురువారం సిద్దిపేటలో హరీశ్‌రావు చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు, డ్రెస్సులు అందించనున్నారు. వందలాది మంది ఉపాధి కోసం ఆటోలు తీసుకొని కాలం వెళ్లదీస్తుండగా కరోనాతో వారి జీవితాలు తలకిందులయ్యాయి.

రోజువారీ ఫైనాన్స్‌లు తీసుకుంటూ ఆటో నడపగా వచ్చిన మొత్తాన్ని మిత్తీలకే చెల్లించుకుంటూ మళ్లీ అప్పుల పాలవుతున్నారు. ఇదంతా గమనించిన హరీశ్‌రావు 2019 అక్టోబరులో సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం ఇందులో సభ్యుల సంఖ్య 850కి చేరింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆటో ఆర్‌సీ తదితర అంశాలు అర్హతగా ఎంత మంది వచ్చినా సభ్యులుగా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments