Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి శ్రీనివాస్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (09:37 IST)
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం... పాలమూరులోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్నారు. 
 
ఆయన కుమారుడు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేశారు. గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం రావడంతో పది రోజుల క్రితం ఆయన పది రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఆయన తన మేనమామ గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో నవీన్ ఊరికి వెళ్లి.. సోమవారం ఉదయం ఊరి నుంచి వచ్చారు. అయితే, ఫ్లాట్ తలుపులు మూసి ఉండటంతో తలుపు కొట్టినప్పటికీ ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఆయన తన వద్ద ఉన్న ఇంకో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లాడు. పడక గదిలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అక్షయ్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందికి దించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొకరలేదని పోలీసులు వెల్డలించారు. కాగా పాలమూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అనేక మంది నుంచి ఆయన డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో పాటు పలువురు ఫిర్యాదు కూడా చేశారు. 
 
దీంతో సెప్టెంబరు 30వ తేదీన అక్షయ్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వా బెయిల్‌పై బయటకు వచ్చిన అక్షయ్ హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నారు. అరెస్టు కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments