Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై ఆంక్షలు సడలింపు

flight
, మంగళవారం, 22 నవంబరు 2022 (08:50 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు వ్యాక్సినేషన్ నిబంధనలతో పాటు హామీ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తాజా నిర్ణయం ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకిరానుంది. 
 
నిజానికి భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఓ ఆన్‌లైన్ ఫాం ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తమ కోరానా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తదితర వివరాలను నింపాల్సి వుంది. ఇపుడు ఈ నిబంధనలను కేంద్రం సడలించింది.
 
ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ అంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచంతో పాటు భారత్‌లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున్న వల్ల అంతర్జాతీయ ప్రయాణికులు మార్గదర్శకాలు సవరించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే వెంటపడి తరిమి కొట్టిన గ్రామస్థులు.. ఎక్కడ?