చంద్రబాబు అరెస్టులో వైకాపా - బీజేపీ కుట్ర : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (14:26 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఏపీలోని అధికార వైకాపా, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీల కుట్ర ఉందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన అరెస్టు వెనకాల బీజేపీ, వైసీపీ కుట్ర ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 
 
'ఇదంతా పచ్చి మోసం. బీజేపీ, వైసీపీ లేనిదే జరగుతుందా? 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని జైల్లో వేస్తారా? ఆయన ఏం పాపం చేశారు? ఆయన ఎవరనీ మోసం చేయలేదు. ఒకప్పుడు ఆయన దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి అవస్థ పెడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం కూడా బాలేదు. ఇదంతా బీజేపీ, వైసీపీ ఆడుతున్న నాటకం' అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 
చంద్రబాబు అంటే తనకు అభిమానమని మల్లారెడ్డి చెప్పారు. తనకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకున్నారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు తనకు రాజకీయ జీవితమిచ్చారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని చెప్పారు. అలాంటి వ్యక్తిని కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో అరెస్టు చేసి జైల్లో పెట్టడం మహా దారుణమని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments