ఇప్పుడిదే తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తెలంగాణ నాయకురాలేంటి తమిళనాడులో చర్చ ఏమిటి అనుకుంటున్నారా...? నాయకులు ఏ ప్రాంతానికి చెందినివారయినప్పటికీ రాజకీయ వ్యక్తుల మధ్య సంబంధాలు వుంటుంటాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా సాధన సభకు మ
ఇప్పుడిదే తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తెలంగాణ నాయకురాలేంటి తమిళనాడులో చర్చ ఏమిటి అనుకుంటున్నారా...? నాయకులు ఏ ప్రాంతానికి చెందినివారయినప్పటికీ రాజకీయ వ్యక్తుల మధ్య సంబంధాలు వుంటుంటాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా సాధన సభకు ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ రాలేదా... అంతే. రాజకీయాలు దేశమంతా తిరుగుతుంటాయి.
ఇంతకీ విషయం ఏంటయా అంటే... విజయశాంతి ఈమధ్య జైలులో వున్న శశికళను కలిశారు. ఐతే జైలులో వున్న ఖైదీతో సాయంత్రం 5 గంటల తర్వాత భేటీ కుదరదు. కానీ రాములమ్మ రాత్రి ఏడు గంటల దాకా అక్కడ చర్చ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైలు నిబంధనలను పట్టించుకోకుండా రాత్రి వరకూ ఏమేమి చర్చించారంటూ తమిళనాడులో జనం అనకుంటున్నారు.
ఐతే శశికళతో విజయశాంతికి మంచి స్నేహసంబంధాలున్నాయట. ఈ నేపధ్యంలోనే ఆమెను కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. కానీ తమిళనాడులో మాత్రం దీనిపై ఓ రేంజిలో చర్చయితే జరుగుతోంది.