Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె కూడా న్యాయవాది కావడంతో సాక్ష్యం ఉండకూడదని చంపేశాం...

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (15:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వామనరావు అనే న్యాయవాద దంపతుల హత్యలో అరెస్టు చేసిన నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. వామనరావు భార్య కూడా న్యాయవాది కావడంతో ఈ కేసులో సాక్ష్యం ఉండకూడదని ఆమెను కూడా చంపేసినట్టు చెప్పారు. 
 
ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులకు గురువారంతో కస్టడీ ముగిసింది. వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్, శివందుల చిరంజీవిలకు నేడు కస్టడీ ముగిసింది. వారిని మంథని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులను 7 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
 
కాగా, రామగుండం అడ్మిన్‌ డీసీపీ అశోక్‌, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ ఆధ్వర్యంలో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. రామగిరి మండలం కల్వచర్ల వద్ద సంఘటన స్థలానికి తీసుకెళ్లి వామన్‌రావు వాహనాన్ని అడ్డగించిన, హత్య చేసిన తీరుపై (సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌) సమగ్రంగా ఆరా తీశారు. మొత్తం విచారణను వీడియోలో రికార్డు చేశారు. 
 
ఇంకా ఈ కేసులో పరోక్షంగా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. వామన్‌రావుతో తమకు వ్యక్తిగతంగా ఉన్న పగ, ప్రతీకారాల కారణంగానే హత్యకు ప్రణాళిక వేశామని, ఆయన భార్య నాగమణి కూడా న్యాయవాది కావడం, ఆమెను కూడా చంపితే ప్రధాన సాక్ష్యం ఉండదనే ఉద్దేశంతోనే ఇద్దరినీ చంపేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments