Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్టులు : ప్రైవేటు ఆస్పత్రుల పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
బుధవారం, 20 మే 2020 (18:07 IST)
కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేవలం గాంధీ, నిమ్స్‌లోనే కాకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 
 
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకునేందుకు అనేక మంది రోగులు వెనుకంజ వేస్తున్నారు. పైగా, కేవలం గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని అనుకోవడం భావ్యం కాదన్నారు. 
 
అంతేకాకుండా, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే... ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు... ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. 
 
ఆస్పత్రులు, ల్యాబ్‌లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను... ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే... కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments