Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 వేల కోట్లకు ఆశపడి సీఎం జగన్ ఆ పని చేసిండు : మంత్రి హరీష్ రావు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు నేరుగా ఆరోపణలు సంధించారు. కేంద్రం ఇవ్వజూపిన రూ.4 వేల కోట్లకు సీఎం జగన్ ఆశపడ్డారని ఆరోపించారు. అందుకే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు మీటర్లు అమర్చుతున్నారంటూ అసలు లోగుట్టును మంత్రి హరీష్ రావు విడమరిచి చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లిలో మంత్రి హరీశ్‌రావు సోమవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఉపయోగించే ప్రతి బావికి, బోరుకు విద్యుత్‌ మీటర్‌ పెట్టాలని.. అందుకు ప్రతిగా తెలంగాణకు రూ.2500 కోట్లు, ఏపీకి రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్‌ చేసిందన్నారు. 
 
రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.. మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రైతు సంక్షేమమే ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం భావించిందని... 'మీటర్లు వద్దు, బిల్లులు వద్దు' అంటూ సీఎం కేసీఆర్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, కార్పొరేట్ ముసుగు వేసుకున్న బీజేపీ ప్రభుత్వం, దేశంలో సరికొత్త జమీందారీ వ్యవస్థకు శ్రీకారం చుడుతోందని, అందులో భాగంగానే రైతులకు ఉచిత విద్యుత్ ను దూరం చేయాలన్న యోచనలో వ్యవసాయ బావులకు, బోర్లకు మీటర్లను అమర్చి నిండా ముంచాలని చూస్తోందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments