Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను పశువుల్లా అమ్మేస్తున్నారు... ఎక్కడ?

సంతలో పశువులను విక్రయించినట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. అమ్మాయిలను అమ్ముతున్నది వ్యభిచారగృహాలకు. అదీకూడా దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:20 IST)
సంతలో పశువులను విక్రయించినట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. అమ్మాయిలను అమ్ముతున్నది వ్యభిచారగృహాలకు. అదీకూడా దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. జాతీయ నేర రికార్డుల సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) వార్షిక నివేదికలో పచ్చినిజాన్ని వెల్లడించింది. 
 
అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ నేర రికార్డుల సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ  విషయం బయటపడింది. దేశంలో అమ్మాయిల విక్రయంపై 8,057 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 229 కేసులున్నాయి. 
 
కాగా, ఉద్యోగాలిప్పిస్తామని ఆశ పెట్టి అమ్మాయిలను నమ్మించి అక్రమంగా తీసుకువెళ్లి వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలావుంటే ఈ యేడాది 314 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు రాష్ట్ర పోలీసులు.
 
2016వ సంవత్సరంలో అమ్మాయిల అక్రమరవాణ, విక్రయంపై హైదరాబాద్ నగరంలో 64 కేసులు నమోదయ్యాయి. మరో 76 మంది మహిళలను పోలీసులు వ్యభిచార రొంపి నుంచి రక్షించారని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదికలు తెలుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments