Webdunia - Bharat's app for daily news and videos

Install App

యథాతథంగా డిగ్రీ పరీక్షలు .. తేల్చి చెప్పిన మంత్రి సబిత

Webdunia
సోమవారం, 5 జులై 2021 (10:51 IST)
తెలంగాణా రాష్ట్రంలో డిగ్రీ పరీక్షలు వాయిదావేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి లోకం గళమెత్తింది. హైద‌రాబాద్ శ్రీనగర్‌ కాలనీలోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు ముట్టపడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త‌త నెల‌కొంది. 
 
క‌రోని విజృంభ‌ణ నేప‌థ్యంలో డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాల‌ని, లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిర‌స‌న తెలిపారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోలేద‌ని, వారికి వ్యాక్సిన్లు వేసేవ‌ర‌కు పరీక్షలను వాయిదా వేయాలన్నారు.
 
హైద‌రాబాద్‌లోని సత్యసాయి నిగమం నుంచి మంత్రి ఇంటి వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స‌బిత‌ జోక్యం చేసుకుని కొంద‌రు విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు.
 
క‌రోనా వేళ విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామన్నారు. పరీక్షలు వాయిదా వేయాల‌న్న డిమాండ్‌పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెలిపారు. 
 
ఆ త‌ర్వాత ఆమె  ఇంటి నుంచి బయటికి వెళ్లారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డే రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ఆందోళ‌న తెలిపారు. దీంతో వారిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments