Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

Webdunia
సోమవారం, 5 జులై 2021 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 
 
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుండి రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పగటి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు తగ్గుతుండడంతో సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఏపీలో ఆదివారం నాటి బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 662 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 29 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మరణించారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,54,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,325 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments