వచ్చే నెలలో తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:02 IST)
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది.

ఈ నెల 31న ఈసెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్‌ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింతగ్‌ పరీక్షలను నిర్వహించనుంది. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది.

రాష్ట్రంలో ప‍్రవేశ పరీక్షలు, ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానంకు తెలిపింది. ఇక ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొత్తుతో వస్తున్నారా, సింగిల్‌గానా? పవన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్: నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ ఫైర్

ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు.. గంటకు 40 వేల టిక్కెట్లు విక్రయం

జీవితంలో హోమియోపతి కీలక పాత్ర : కోహ్లీ సతీమణి అనుష్క

జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

తర్వాతి కథనం
Show comments