Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షేమంలో కేసీఆర్ దేశంలోనే టాప్ అట!

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:06 IST)
సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రజాదరణ విషయంలో మొదటి స్థానం సంపాదించుకున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై సీఓటర్ ఐఏఎన్‌ఎస్ సంయుక్తంగా సర్వే నిర్వహించి, ఫలితాలను విడుదల చేశాయి. 
 
పనితీరు విషయంలో దేశంలోని ముఖ్యమంత్రులు అందరి కంటే కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ఈ సర్వే కోసం తెలంగాణలో 20,827 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందులో 68.3 శాతం మంది కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయగా, 20.8 శాతం మంది కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 9.9 శాతం మంది మాత్రం ఆయన పనితీరు అస్సలు నచ్చలేదని అభిప్రాయపడ్డారు.
 
కేసీఆర్ తర్వాత స్థానాల్లో వరుసగా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో నిలిచారు. ఆయన పనితీరుపై 41.7 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ఈ జాబితాలో పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు అట్టడుగున నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments