Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటన రాకున్నా పరభాషా నటులకే పెద్దపీటా...? కోట శ్రీనివాసరావు

Advertiesment
నటన రాకున్నా పరభాషా నటులకే పెద్దపీటా...? కోట శ్రీనివాసరావు
, శుక్రవారం, 22 మార్చి 2019 (17:58 IST)
కడదాకా ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరు పక్షాల ప్రెస్‌మీట్‌లతో పలు వివాదాలు సృష్టించిన "మా" అసోసియేష‌న్ బృందం ప్ర‌మాణ స్వీకారం అనేక వివాదాల మ‌ధ్య ముగిసింది. ఈ సందర్భంగా, రాజ‌శేఖ‌ర్ అల‌గ‌డం.. శివాజీ రాజా అస‌హ‌నం వ్యక్తం చేయడం ఇలా కొన్ని టెన్ష‌న్స్ మ‌ధ్య కొత్త అధ్య‌క్షుడిగా న‌రేష్ ప్ర‌మాణ స్వీకారం పూర్తి చేసేసాడు. 
 
ఇటీవల జరిగిన ఎన్నిక‌ల్లో ఈయన శివాజీ రాజాపై 68 ఓట్ల‌తో గెలుపొందాడు. ఇదిలావుంటే ఈ వేడుక‌కు హాజ‌రైన సీనియర్ నటుడు కోట శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. ఎంత‌మంది కొత్త అధ్య‌క్షులు వ‌చ్చినా కూడా తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు న‌టుల భ‌విష్య‌త్తు మార్చ‌లేక‌పోతున్నారంటూ ఆయ‌న ఈ సందర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేసాడు.
 
ముఖ్యంగా క‌నీసం నెల‌లో 12 రోజులైనా మ‌న న‌టుల‌కు వేషాలు దొరికేలా చేస్తే కృష్ణాన‌గ‌ర్ ద‌గ్గ‌ర ఎంతోమంది జీవితాలకు కాస్త అన్నం దొరుకుతుంద‌ని చెప్పుకొచ్చిన ఆయ‌న..‌. ఎక్క‌డ నుండో ప‌ర‌భాషా న‌టుల‌ను విమానాల్లో తీసుకొచ్చి.. వాళ్ల‌కు ల‌క్ష‌లకు ల‌క్ష‌లు ఇచ్చి.. ఏసీ రూమ్స్ బుక్ చేసి వాళ్ల ఆస్తులు ఎందుకు పెంచుతున్నారో తనకు అర్థం కావ‌డం లేదంటూ మండిప‌డ్డారు‌. అస‌లు న‌ట‌న కూడా రాని మొహాల‌ను తీసుకొచ్చి ఇక్క‌డ నెత్తిన పెట్టుకుంటుంటే క‌డుపు కాలిపోతోంద‌ని ఈ సీనియర్ నటుడు ఆవేదన వ్యక్తంచేశారు. 
 
తెలుగులో తెలుగు వాళ్ల‌ను ప్రోత్స‌హించ‌క‌పోవ‌డం కంటే దారుణం మ‌రొకటి లేదంటున్న ఆయ‌న..‌. ఈ విష‌యంపై ఎప్ప‌ట్నుంచో పోరాటం చేస్తున్నాడు. కాగా... ఇదే విష‌యాన్ని ఇప్పుడు మ‌రోసారి గుర్తు చేసాడు కోట‌. మా ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో కొత్త వ‌ర్గ‌మైనా ఏదైనా చేయాలంటూ ఆయ‌న కోరాడు. తాను సామి అనే త‌మిళ సినిమాలో విల‌న్ వేషం వేయ‌డానికి వెళ్లిన‌పుడు క‌నీసం రూమ్స్ కూడా ఇవ్వ‌కుండా.. ఇబ్బంది పెట్టార‌ని గుర్తు చేసుకున్నాడు కోట‌.
 
కానీ మ‌నం మాత్రం ప‌ర‌భాషా న‌టుల‌కు స‌ర్వం స‌మ‌కూర్చి మ‌రీ ఆస్తులు కూడ‌బెట్టేలా చేస్తున్నామ‌ని విమ‌ర్శించాడు కోట‌. వాళ్లు ఇక్క‌డ ఇళ్లు క‌ట్టుకుంటుంటే.. మ‌నోళ్లు మాత్రం పెన్ష‌న్ కోసం వేచి చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టాడు ఈ సీనియ‌ర్ న‌టుడు. అమితాబ్ బ‌చ్చ‌న్, నానా ప‌టేక‌ర్ లాంటి ద‌మ్మున్న న‌టుల‌ను తీసుకొస్తే.. వాళ్ల ద‌గ్గ‌ర నౌఖ‌రు వేషం వేయ‌డానికి కూడా సిద్ధ‌మే అనీ... కానీ న‌ట‌న రాని వాళ్ల‌ను తీసుకొచ్చి ఇక్క‌డ అంద‌లం ఎక్కిస్తూంటే మండి పోతుందంటున్నాడు కోట‌.
 
మరి నూతన కార్యవర్గం దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో అదీ చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిహారిక 'సూర్యకాంతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన "రౌడీ"