Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపోచమ్మ ఆలయంలో చండీహోమం - పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (09:47 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎక్కడలేని దైవభక్తి. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వివిధ రకాల యజ్ఞాలు, హోమాలు చేస్తున్నారు. శుక్రవారం కూడా చండీహోయం నిర్వహించారు. ఇది కొండపోచమ్మ ఆలయంలో జరిపించారు. ఇందులో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. 
 
ఈ చండీహోమం పూర్ణాహుతి పూజలు శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు జరిగింది. దీన్ని స్థానిక సర్పంచ్‌ రజిత - రమేశ్‌, ఆలయ ఛైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. 
 
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు.. సీఎం దంపతులకు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత హోమ నిర్వాహకులు సీఎం కేసీఆర్‌కు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
 
పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. ఉదయం 9: 35 గంటలకు తన సొంత ఖర్చులతో నిర్మించనున్న ఎర్రవల్లి రైతు వేదికకు సీఎం భూమిపూజ చేయనున్నారు. 
 
ఆ తర్వాత 9: 45 గంటలకు మర్కుక్‌లో రైతు వేదికకు భూమి పూజ చేస్తారు. ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామీ పాల్గొంటారు. 
 
ఉదయం 11:30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments