Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్నల్ సంతోష్‌ బాబుకు కేసీఆర్ ఘన నివాళి .. రూ.5 కోట్ల సాయం

Telangana
Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (16:42 IST)
చైనా బలగాల బరితెగింపు చర్యల కారణంగా లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఘన నివాళులు అర్పించారు. ఆయన హైదరాబాద్ నగరం నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు చేరుకున్న కేసీఆర్... సంతోష్ బాబు చిత్రాప‌టానికి పుష్ప నివాళి అర్పించారు. 
 
ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్‌.. క‌ల్న‌ల్ కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడారు. ఆ వీర‌యోధుడి కుమారుడు, కుమార్తెను కూడా ప‌లుక‌రించారు.  సంతోష్ భార్య సంతోషి, త‌ల్లితండ్రుల‌తోనూ సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చ‌టించారు. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్‌.. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని అంద‌జేశారు. 
 
అంతేకాకుండా కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. షేక్‌పేట‌లో 700 గ‌జాల ఇంటి స్థ‌లాల ప‌త్రాల‌ను కూడా సీఎం కేసీఆర్‌.. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబానికి అంద‌జేశారు. ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ 1 జాబ్ ఇస్తాన‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 
 
సూర్యాపేట‌లోని క‌ల్న‌ల్ సంతోష్ నివాసానికి వెళ్లిన వారిలో విద్యుత్‌శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, రోడ్లు, భ‌వ‌నాలు, గృహ‌నిర్మాణ‌, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌, రాష్ట్ర సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments