Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్ల ఓపెనింగ్‌కు తెలంగాణ సర్కార్ పచ్చజెండా.. గైడ్‌లైన్స్ ఇవే

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (18:32 IST)
తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్ల ఓపెనింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌తో తెలంగాణలో సినిమా థియేటర్లకు అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది. అయితే. థియేటర్ లో ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలని ఆదేశించింది. మరోవైపు.. టిక్కెట్ల రేట్లు పెంచుకునే అధికారం యాజమాన్యాలకు వదిలేసింది సర్కార్. 
 
ఇక మరి కొన్ని మార్గదర్శకాలను కూడా థియేటర్స్ కి జారీ చేసింది సర్కార్. కామన్ పాయింట్స్ సహా జనాలు వాడే అన్ని ప్రదేశాలను ప్రతి ఆట పూర్తి అయ్యాక సానిటైజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
అలానే ఒక మల్టీప్లెక్స్‌లో ఒకేసారి 2,3 ఆటలు ప్రదర్శిస్తున్నప్పుడు ఆ రెండు ఆటలకు ఒకే సారి ఇంటర్వెల్ రాకుండా ప్లాన్ చేయాలని ఆదేశించింది. సినిమా థియేటర్ కి వచ్చేవారు సహా అక్కడ పనిచేసే వారు తినుబండారాలు అమ్మే వారు నిరంతరం మాస్కు ధరించి ఉండాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments