కేసీఆర్ మాటే శాసనం... హరీశ్-ఈటెలకు మొండిచెయ్యేనా? గోళ్లు కొరుకుతున్నారు...

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (19:28 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ముహూర్తాన్ని ఫిక్స్ చేసేశారు కూడా. మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన వారికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. ఐతే గత మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహించిన హరీశ్ రావు, ఈటెలకు మాత్రం ఇప్పటివరకూ విషెస్ రాలేదట. దీనితో సదరు మాజీ మంత్రుల మద్దతుదార్లు టెన్షన్ తట్టుకోలేక గోళ్లు కొరుక్కుంటున్నారట. 
 
బయటకు ఏమైనా మాట్లాడితే ఏమవుతుందోనన్న భయం కూడా వుండనే వుంటుంది. అందులోనూ కేసీఆర్ అంటే మాటలు కాదు... ఆయన మాటే శాసనం అంటుంటారు తెరాస నాయకులు. కాబట్టి మంత్రివర్గంలో బెర్తు కన్ఫర్మ్ అయ్యేవరకూ అలా గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడమో లేదంటే అలా గోళ్లు కొరుక్కోవడం తప్పించి ఏమీ చేయలేం అంటున్నారు. 
 
మరోవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి కూడా ఇప్పటివరకూ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. దీన్నిబట్టి చూస్తుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు హేమాహేమీలు కేంద్రంలో మంత్రి పదవుల్లో అలంకరిస్తారని అనిపించడంలేదూ.... ఏమంటారు?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments