Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ బలుపు దింపుతాం : మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (10:09 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అహంకారంతో కొట్టుకుంటున్నావ్ కేటీఆర్.. నీ బలుపు దింపుతాం అంటూ మందలించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. 
 
ఆయన తాజాగా మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని సీఎం కేసీఆర్ 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, కేవలం 80 వేలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పి అదేదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. 
 
అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకు ఏం చెబుతావ్ కేసీఆర్ అంటూ ప్రశ్నిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్డీయే వంటి అనేక సంస్థల ద్వారా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తోందని, అయినా సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన అంశంపై రాజాసింగ్ మండిపడ్డారు. అధికారం, డబ్బుమదం, అహంకారంతో కొట్టుకుంటున్న కేటీఆర్‌ బలుపును దింపుతామని అన్నారు. "నీ బలుపును దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విషయాన్ని గుర్తుపెట్టుకో కేటీఆర్" అంటూ రాజాసింగ్ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments