టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌కు బెయిల్.. నేడు జైలు నుంచి రిలీజ్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం ఒకటి లీకైంది. ఈ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారంటా అభియోగాలు మోపిన పోలీసులు.. ఆయన్ను బుధవారం అర్థరాత్రి అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు కోర్టులో హాజరుపరచగా, ఆయనకు ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం హన్మకొండ నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో దాదాపు ఎనిమిది గంటల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వా రాత్రి 10 గంటలకు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, ఆధారాలను ధ్వంసం చేయొద్దని ఆదేశించారు. బండి సంజయ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 
 
మరోపైవు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న బూర ప్రశాంత్, ఏ-3గా ఉన్న గుండబోయిన మహేశ్‌లను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై విచారణనుు న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments