Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు : అక్టోబరు 5 వరకు...

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:22 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు మొదలైనప్పటికీ తొలి రోజున ఇటీవల మరణించిన భ‌ద్రాచ‌లం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, క‌రీంన‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే ఎం స‌త్యనారాయ‌ణ‌రావు, వ‌ర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచ‌ర్ల జ‌గన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గార‌పు సీతారామ‌య్య‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశ‌య్యకు మాజీ ఎమ్మెల్యేలకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. సంతాప తీర్మానాల అనంతరం శాసన సభ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి.
 
మరోవైపు, తెలంగాణలో వర్షకాల అసెంబ్లీ సమావేశాలు అక్టోబరు ఐదో తేదీ వరకు జరుగనున్నాయి. శాసన సభలోని స్పీకర్‌ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 
 
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 25, 26 (శని, ఆదివారాలు), అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 3 (ఆదివారం) తేదీల్లో సభకు సెలవు దినాలుగా ప్రకటించింది. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments