Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్కొండ మెట్లబావి - దోమకొండకు యునెస్కో గుర్తింపు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (08:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రెండు కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. అలాగే, ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం, బైకుల్లా రైల్వే స్టేషన్‌కు ఈ ఆవార్డులు వచ్చాయి. 
 
యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలకు ఆసియా - పసిఫిక్ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోవలోనే తాజాగా దేశంలోని పలు భవనాలకు ఈ అవార్డులు వరించాయి. 
 
ముఖ్యంగా తెలంగాణాలో గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ విభాగంలోనూ, దోమకొండ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ విభాగంలో చోటు సంపాదించుకున్నాయి. 
 
ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల్లో 50 చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు రాగా, వీటి వడపోత తర్వాత ఆరు దేశాల్లో 13 కట్టడాలను ఐదు కేటిగిరీల్లో అవార్డుల్లో ఎంపిక  చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా, ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆప్ఘనిస్థాన్‌, నేపాల్ దేశాలకు ఒక్కొక్కటి చొప్పున దక్కాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments