Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై కృష్ణా నదిలో జలవిహారం : తెలంగాణ పచ్చజెండా

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (09:11 IST)
విహార యాత్రలతో కృష్ణానది మళ్లీ కళ సంతరించుకోనుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన జలవిహారాలను పునరుద్ధరించాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పర్యాటక ప్యాకేజీలను శనివారం నుంచి పునరుద్ధరించనుంది. 
 
ప్రస్తుతం కృష్ణానది నీటిమట్టం లాంచీల ప్రయాణానికి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. కృష్ణా నదిలో విహారయాత్రలకు సంబంధించి పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,999 చొప్పున వసూలు చేస్తారు. 
 
ఇది కేవలం రెండు రోజుల ప్యాకేజీ మాత్రమే. ఇందులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రెండో ప్యాకేజీలో హైదరాబాద్ - శ్రీశైలం - నాగార్జునసాగర్ యాత్ర. గతంలో ఈ యాత్ర శ్రీశైలం నుంచి సాగర్ వరకు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారు. 
 
ఈ రెండు యాత్రలు ఉదయం ఏడు గంటల సమయంలోనే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ ధర కూడా రూ. 3,999 మాత్రమే. ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు. ఈ యాత్రలు ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments