Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస అభ్యర్థిని ఓడించడమే ధ్యేయంగా హుజురాబాద్‌లో 1000 మంది పోటీ?

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (14:02 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్రంలోని నిరుద్యోగులతో పాటు.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గుర్రుగా ఉన్నారు. దీంతో రాష్ట్ర సర్కార్​తో నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో 1,000 మందితో పోటీ చేస్తామని హెచ్చరించారు. 
 
హుజూరాబాద్‌లోని వెంకట సాయి గార్డెన్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. దీనికి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్​లో సర్క్యులర్ నెంబర్ 4779ని ప్రభుత్వం జారీ చేసిందని, ఆ జీవోను రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమిస్తే 2020 మార్చిలో విధుల నుంచి తొలగించిందన్నారు. 
 
16 నెలలుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సర్కార్ పట్టించుకోలేదన్నారు. ఉపఎన్నికలు జరిగిన ప్రతిసారీ మాయ మాటలు చెప్పి, ఎన్నికలయ్యాక పట్టించుకోవడం లేదన్నారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే ప్రత్యక్ష పోరు తప్పదన్నారు.
 
 సర్కార్ దిగి రాకుంటే హుజూరాబాద్​లో వెయ్యి మందితో నామినేషన్లు వేస్తామని, నిజామాబాద్ లోక్​సభ స్థానంలో 2019లో వచ్చిన రిజల్ట్ ఇక్కడా రిపీట్ అవుతుందన్నారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్‌లోనే మకాం వేసి అధికార పార్టీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments