Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్.. పెళ్లి కూతురు ఎదుర్కోలులో మత్తులో డ్యాన్సులు.. కత్తిపోట్లు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:15 IST)
పెళ్ళికూతురు ఎదుర్కొలులో యువకుల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోట్లకు దారితీసింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘోరిగడ్డ తాండాలో దారుణం జరిగింది. ఘోరిగడ్డ తాండాకు చెందిన రమేష్ అనే యువకుడి పెళ్ళి వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గురువారం తెల్లవారుజామున పెళ్ళి కూతురును తాండాకు తీసుకొచ్చి ఎదుర్కోలు చేస్తున్న సమయంలో యువకులంతా లాక్‌డౌన్ నిబంధనలు గాలికొదిలేసి డీజే పెట్టుకొని మద్యం మత్తులో డ్యాన్సులు వేశారు. ఒకరిపై ఒకరు తమ్సప్ చిమ్ముకుంటూ మైమరచి డ్యాన్సులు చేస్తున్న క్రమంలో యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఈ వాగ్వాదం కాస్తా కత్తిపోట్లకు దారితీసింది. సంజయ్ అనే యువకుడు కత్తితో రాహుల్ అనే యువకుడిపై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో రాహుల్ కడుపులో కత్తి పోటు బలంగా దిగడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే రాహుల్‌ను అతని కుటుంబ సభ్యులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు సంజయ్..
 
అతనికి సహకరించిన మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. రాహుల్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సంజయ్‌తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్ళి వేడుకల్లో పాల్గొని ఘర్షణ పడ్డ ఈ యువకులంతా ఘోరిగడ్డ తాండాకు చెందిన వారైనప్పటికీ.. జీవనాధారం కోసం పుణేలో ఉంటున్నారు. వీరంతా రమేష్ పెళ్ళి కోసం సొంతూరికి వచ్చారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments