సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరాములపల్లికి చెందిన వివేకానందరెడ్డి (16) గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (18:18 IST)
సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరాములపల్లికి చెందిన వివేకానందరెడ్డి (16) గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గతంతో వివేక్ తండ్రి ఏలేటి తిరుపతిరెడ్డి అతనికి సెల్‌ఫోన్ కొనిచ్చాడు. 
 
ఇటీవల తిరుపతి వెళ్లినప్పుడు వివేక్ సెల్‌ ఫోన్ పోయింది. దీంతో మళ్లీ కొత్త ఫోన్ కొనివ్వాలని మారాం చేస్తూ వచ్చాడు. అయితే ఇటీవలే ఇంటి నిర్మాణం, ద్విచక్రవాహనం కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు పెరిగాయని, అందువల్ల తర్వాత కొనిస్తానని తండ్రి నచ్చజెప్పినప్పటికీ మనస్తాపం చెందిన వివేక్ మంగళవారం రాత్రి ఇంటిలో వారందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments