Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు జారిన తెరాస ఎమ్మెల్యే టి.రాజయ్య

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (11:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.రాజయ్య నోరుజారారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన... తెరాస సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా ఇదే వర్తిస్తుందని, పార్టీని రక్షించుకోవడానికి ఇదే మంచి మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 
 
రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అవకాశం కోసం చూస్తున్న ప్రతిపక్షాలు రాజయ్య వ్యాఖ్యలపై ఎంత ఘాటుగా స్పందిస్తాయో చూడాలి. కాగా, గతంలో కూడా టి.రాజయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మంత్రిపదవిని కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments