Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు ప్రధాని.. స్పెషల్ మెను.. హైదరాబాదుకు యాదమ్మ

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (15:29 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముస్తాబవుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ, జాతీయ స్థాయి నాయకులు, అతిరథ మహారథులకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పెషల్ ఏర్పాటు చేస్తుంది. 
 
జులై 2,3 తేదీల్లో జరగబోయే బీజేపీ స్పెషల్ మీట్‌కు స్పెషల్ మెను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ స్పెషల్ మీట్‌లో తెలంగాణ స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
 
ఈ స్పెషల్ మెనులో మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు ఉండేలా చూస్తున్నారు. పచ్చిపులుసు, పంటికూర పప్పు, గంగవాయిలి- మామిడి పప్పు, తెల్లజొన్నరొట్టెలు, బూందీలడ్డూను ఆల్ మోస్ట్ మెనులో చేర్చారు. సాయంత్రం స్నాక్స్‌గా సర్వపిండి, సకినాలు, గారెలు వడ్డించనున్నారు. ఇప్పటికే ఈ వంటల్లో కరీంనగర్‌‌కు చెందిన యాదమ్మ ఆయా పరిసరాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
 
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్పెషల్ మెనునూ సిద్ధం చేసేందుకు కరీంనగర్‌ నుంచి యాదమ్మను హైదరాబాద్‌కు రప్పించారు. యాదమ్మతో పాటు నోవాటెల్‌ చెఫ్‌లతో బండి సంజయ్‌ ఇప్పటికే భేటీ అయ్యారు. వంటకాలు అదరహో అనేలా ఉండాలని చెఫ్ లకు సూచించినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments