Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు వేల పెన్షన్ కోసం.. కన్నతల్లినే కడతేర్చాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (15:47 IST)
ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు కోసం ఎంత నేరాలనైనా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా కన్నతల్లికి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు పెన్షన్ డబ్బుకు కక్కుర్తిపడ్డాడు. అంతే కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. తల్లిని కన్నకొడుకే అత్యంత కిరాతకంగా చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం ఖుదావాన్​పూర్​కు చెందిన బలవంత్ తన తల్లి భీమమ్మ(62)ను విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన బలవంత్​ విచక్షణ కోల్పోయి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని తల్లి పెళ్లి చేసిందని.. కానీ తాగి వచ్చి భార్యను వేధించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు వెల్లడించారు. 
 
తర్వాత తల్లితో ఉంటున్న బలవంత్.. రైతు బంధు, పింఛను డబ్బు కోసం ఆమెను నిత్యం వేధించేవాడని చెప్పారు. శుక్రవారం రోజున భీమమ్మకు రూ.2వేలు పెన్షన్ డబ్బు రావడంతో ఆమె నుంచి వేయి రూపాయలు లాక్కున్నాడని.. మిగతా వేయి రూపాయల కోసం రాత్రి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను ఆరా తీయగా.. పెన్షన్ డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments