కేసీఆర్ వన్నీ ఎన్నికల హామీలే: ఎమ్మెల్యే సీతక్క

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:41 IST)
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు, దళిత బంధు పథకాలన్నీ ఎన్నికల హామీలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ గిరిజన విభాగం సమావేశంలో సీతక్క మాట్లాడారు.
 
దేశంలో 12 కోట్లమంది గిరిజనులు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గిరిజనులకు పోడు భూములకు హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీనేనని ఆమె తెలిపారు.
 
దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణలో కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు.
 
హరితహారం పేరుతో గిరిజనుల భూములను కేసీఆర్ గుంజుకున్నారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల్ ఇస్తామన్న కేసీఆర్, వాటిని పట్టించుకోలేదన్నారు. దీనిపై గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలన్నారు.
 
ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజు ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ, దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా అని సీతక్క ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments